Header Banner

లాస్ ఏంజెలెస్ లో రెచ్చిపోయిన ఆందోళనకారులు.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉక్కుపాదం!

  Sat Jun 07, 2025 16:44        U S A

అక్రమ వలసదారులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. తాజాగా ట్రంప్ ఆదేశాల మేరకు అక్రమ వలసదారుల ఏరివేతకు ఫెడరల్ అధికారులు శుక్రవారం లాస్ ఏంజెలెస్ లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నగరంలోని ఫ్యాషన్ డిస్ట్రిక్ట్ ఫెడరల్ ఏజెంట్లు అక్రమ వలసదారుడనే కారణంతో ఒక దుస్తుల వ్యాపారిపై దాడి చేసి, అనేకమంది ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో వారి చర్యలకు వ్యతిరేకంగా లాస్ ఏంజెలెస్ లో ప్రజలు పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు. వందల సంఖ్యలో ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. రోడ్ల పైకి రావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లాఠీలు, టియర్ గ్యాస్ ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు. పదుల సంఖ్యలో నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. సర్వీస్ ఎంప్లాయీస్ ఇంటర్నేషనల్ యూనియన్ కాలిఫోర్నియా అధ్యక్షుడు డేవిడ్ హుయెర్దాను కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నార  

ఇది కూడా చదవండి : ట్రంప్ సంచలన నిర్ణయం! ఎలాన్ మాస్క్ కు గుడ్ బై! ఒప్పందాలు రద్దు చేస్తానంటూ...

 దీంతో మరింత రెచ్చిపోయిన ఆందోళనకారులు లాస్ ఏంజెలెస్ లోని ఫెడరల్ భవనం వెలుపల వందలాది మంది గుమిగూడి.. ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులను అడ్డుకోవడానికి ఫెడరల్ అధికారులు వారిపై పెప్పర్ స్ప్రేను ఉపయోగించారని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. దీనిపై అధికారులు స్పందిస్తూ.. అక్రమ వలసదారులను దేశం నుంచి పంపడానికి అమెరికా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే వారిని అరెస్ట్ చేశామన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న అక్రమ వలసదారులను గుర్తించి రోజుకు కనీసం 3వేల మందిని అరెస్ట్ చేయాలని వైట్ హౌస్ సహాయకుడు స్టీఫెన్ మిల్లర్ తమకు ఆదేశాలు జారీ చేశారని అన్నారు. ఈ ఆపరేషన్లో భాగంగానే లాస్ ఏంజెలెస్ లో దాదాపు 44 మంది అక్రమ వలసదారులను అరెస్ట్ చేశామని.. తమను అడ్డుకోవడానికి ప్రయత్నించిన మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు.

 

ఇది కూడా చదవండి చరిత్రలోనే అతిపెద్ద విరాళం.. రూ.151 కోట్లు ఇచ్చిన ముఖేష్‌ అంబానీ! ఎవరికంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

8 జిల్లాలతో పాటు విశాఖ ఆర్థిక ప్రాంతం.. లక్ష ఎకరాల్లో ప్రాజెక్టులు.. అదిరిపోయే బాబు ప్లాన్!

 

అదిరిపోయే శుభవార్త: ఏపీలో భారీగా నిల్వలు.. తవ్వుతుంటే కిలోలకి కిలోలే బయటికి వస్తుంది!

 

ఏపీ మహిళలకు శుభవార్త! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారు, దరఖాస్తు చేసుకోండి!

 

షుగర్ అని భయపడుతున్నారా.. అయితే దీన్ని తీసుకోవడం వల్ల ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు!

 

రెడ్ అలర్ట్! ఆ జిల్లాల్లో కుండ పోత వర్షాలు! ప్రజలు బయటకు రావద్దు!

 

గుడ్ న్యూస్.. మరో రెండు నెలల్లో భారీగా తగ్గనున్న బంగారం ధరలు! 12 - 15% తగ్గే అవకాశం!

 

బంపర్ ఆఫర్.. దుబాయ్ లాటరీలో విమాన టిక్కెట్లు, ఫోన్లు గెలుచుకోండి ఇలా! ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు..

 

ఓ ఇంటి వాడైన అక్కినేని వారసుడు అఖిల్.. హాజరైన సినీ తారలు!

 

బిగ్ అప్డేట్.. ఈ విషయం తెలియకుండా అస్సలు ఫ్లైట్ ఎక్కొద్దు.. లేదంటే మీ పని అంతే.!

 

అమెరికాలోకి ప్రవేశంపై 19 దేశాలకు షాక్.. ట్రంప్ నుంచికొత్త ప్రయాణ నిషేధ ఉత్తర్వులు!

 

రైతులకి గుడ్ న్యూస్.. పంటకి కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం! దరఖాస్తు ఇలా..

 

నా తప్పు మృగాళ్లందరికీ కనువిప్పు కావాలి.. పాపా నువ్వయినా నన్ను క్షమిస్తావా!

 

జగన్‌పై కేంద్రమంత్రి ఆగ్రహం.. మీ తీరు మారకపోతే ఈసారి మిగిలేది ఒక్కటే!

 

ట్రంప్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. విద్యా, దౌత్య వర్గాల్లో తీవ్ర ఆందోళన! వీసాల రద్దుకు కూడా ఆదేశాలు..

 

హామీల అమలుపై చర్చకు రావాలి.. వైకాపాకు మాజీ మంత్రి, తెదేపా ఎమ్మెల్యే సవాల్!

 

యువగళం పుస్తకం.. లోకేష్‌కు పవన్ అభినందనలు! ఆనాటి అనుభవాలను కళ్ల‌కి కట్టినట్లుగా..

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #andhrapravasi #andhrapradesh #usa #world #news #arrest #immigration #crackdown